Tuesday, 25 August 2026
  • Home  
  • అంగన్‌వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే సోమిరెడ్డి అభినందన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగన్‌వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే సోమిరెడ్డి అభినందన

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలుగా నియమితులైన 36 మంది సిబ్బంది నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సిబ్బంది నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ఎమ్మెల్యే సోమిరెడ్డి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అంకితభావంతో పనిచేస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలుగా నియమితులైన 36 మంది సిబ్బంది నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సిబ్బంది నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ఎమ్మెల్యే సోమిరెడ్డి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అంకితభావంతో పనిచేస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.