విశాఖపట్నం, ఆగస్టు 24: నగరంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని మరింత అత్యాధునిక సదుపాయాలతో పునరాభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టనున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ తెలిపారు. సోమవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి ఈస్ట్ జోన్ ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం జంక్షన్‌కు ఇరువైపుల ఉన్న టీటీడీ కల్యాణ మండపం, కార్యాలయ భవనం, ఖాళీ స్థలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ టీటీడీ కల్యాణ మండపంతో పాటు సంబంధిత భవనాలు, ఖాళీ స్థలాలను కలియతిరిగి పరిశీలించి, వాటి విస్తీర్ణం, ప్రస్తుత వినియోగం, స్థలాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలోనే ఉత్తమ కల్యాణ మండపంగా టీటీడీ కల్యాణ మండపాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత అత్యాధునికంగా పునరాభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి టిటిడి కళ్యాణమండపం జంక్షన్ సమీపంలో ఉన్న టీటీడీ కళ్యాణమండపం, పరిసర భవనాలు, ఖాళీ ప్రదేశాలను పూర్తి వివరాలతో సమగ్ర సర్వే నిర్వహించి, తగు నివేదికను వెంటనే సమర్పించాలని సీతమ్మధార తహసీల్దార్ ప్రసాద్, టీటీడీ మేనేజర్ వెంకటరమణ, ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్‌లను ఆదేశించారు.
ఈ పరిశీలనలో జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు, ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్, సీతమ్మధార తహసీల్దార్ ప్రసాద్, టీటీడీ మేనేజర్ వెంకటరమణ, కల్యాణ మండపం మేనేజర్ హైమవతి, సహాయక వైద్యాధికారి బి. ప్రసాదరావు, రెవెన్యూ సర్వేయర్, జీవీఎంసీ టీపీఓ ప్రమీల, వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

అత్యాధునికంగా టీటీడీ కల్యాణ మండపం పునరాభివృద్ధికి చర్యలు.
విశాఖపట్నం, ఆగస్టు 24: నగరంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని మరింత అత్యాధునిక సదుపాయాలతో పునరాభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టనున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ తెలిపారు. సోమవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి ఈస్ట్ జోన్ ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం జంక్షన్‌కు ఇరువైపుల ఉన్న టీటీడీ కల్యాణ మండపం, కార్యాలయ భవనం, ఖాళీ స్థలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీటీడీ కల్యాణ మండపంతో పాటు సంబంధిత భవనాలు, ఖాళీ స్థలాలను కలియతిరిగి పరిశీలించి, వాటి విస్తీర్ణం, ప్రస్తుత వినియోగం, స్థలాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే ఉత్తమ కల్యాణ మండపంగా టీటీడీ కల్యాణ మండపాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత అత్యాధునికంగా పునరాభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి టిటిడి కళ్యాణమండపం జంక్షన్ సమీపంలో ఉన్న టీటీడీ కళ్యాణమండపం, పరిసర భవనాలు, ఖాళీ ప్రదేశాలను పూర్తి వివరాలతో సమగ్ర సర్వే నిర్వహించి, తగు నివేదికను వెంటనే సమర్పించాలని సీతమ్మధార తహసీల్దార్ ప్రసాద్, టీటీడీ మేనేజర్ వెంకటరమణ, ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్‌లను ఆదేశించారు. ఈ పరిశీలనలో జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు, ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్, సీతమ్మధార తహసీల్దార్ ప్రసాద్, టీటీడీ మేనేజర్ వెంకటరమణ, కల్యాణ మండపం మేనేజర్ హైమవతి, సహాయక వైద్యాధికారి బి. ప్రసాదరావు, రెవెన్యూ సర్వేయర్, జీవీఎంసీ టీపీఓ ప్రమీల, వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

