కాకినాడ రూరల్ సూర్యరావుపేట బీచ్ వద్ద ప్రమాదవశాత్తు సముద్రంలో నలుగురు వ్యక్తులు గల్లంతైన ఘటనపై కాకినాడ రూరల్ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే స్పందించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సముద్రం నుండి సురక్షితంగా రక్షించబడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులను ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు వారి తనయుడు శ్రీ పంతం సందీప్ గారు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. గల్లంతయిన కుటుంబ సభ్యులను కలిసి జరుగుతున్న గాలింపు చర్యల గురించి వివరించారు.





