విశాఖపట్నం కంచరపాలెం రైతు బజార్ పక్కన శ్రీనగర్ ప్రాంత వాసి పెయింటర్ దమ్ము రాజు(36) ఈ నెల 9న, పువ్వుల వ్యాపారి సిమ్మ లక్ష్మీ, ఆమె పెద్ద కుమారుడు సిమ్మ మణికంఠ, రెండో కుమారుడు సుమంత్, కృష్ణ కలిసి రాజుని రోడ్డు పక్కన స్తంభానికి కట్టేసి దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన రాజు ఆదివారం తెల్లవారు జామున రాజు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు కంచరపాలెం రైతు బజార్ పక్కన, లక్ష్మి పూల దుకాణం వద్దకు చేరుకొని రాజును చంపేసిన నిందితులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రోడ్డుమీద ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.ఆందోళన వద్దకు చేరుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.


