నంద్యాల: వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నంద్యాల వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ కాలువలు, రిజర్వాయర్లకు సాగునీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. నంద్యాల అర్బన్, రూరల్ పరిధిలో సుమారు 30 వేల ఎకరాల పంటలకు నీరు అవసరముందని, వెంటనే సాగు, తాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.తక్షణమే నీటిని విడుదల చేయకపోతే రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, రైతు నాయకులు పాల్గొన్నారు.
సాగునీరు విడుదల చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమం: శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి