Sunday, 23 August 2026
  • Home  
  • జన సందోహం మధ్య రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు
- కడప

జన సందోహం మధ్య రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు

జన సందోహం మధ్య రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు కడప, ఆగస్టు 21 – పున్నమి ప్రతినిధి: కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మధ్య సంతోషోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. చింతకొమ్మదిన్నె జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా, కడప నగర తొలి మేయర్‌గా, కమలాపురం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందిన రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆకాంక్షించారు. రవీంద్రనాథ్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో మహిళా నాయకురాళ్లు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, ఎస్సీ సెల్ నాయకులు పులి సునీల్ కుమార్, వైఎస్సార్‌సీపీ కడప నగర యువ నాయకులు గుంటి నాగేంద్రతో పాటు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జన సందోహం మధ్య రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు

కడప, ఆగస్టు 21 – పున్నమి ప్రతినిధి:

కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మధ్య సంతోషోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు.

చింతకొమ్మదిన్నె జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా, కడప నగర తొలి మేయర్‌గా, కమలాపురం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందిన రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆకాంక్షించారు.

రవీంద్రనాథ్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో మహిళా నాయకురాళ్లు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, ఎస్సీ సెల్ నాయకులు పులి సునీల్ కుమార్, వైఎస్సార్‌సీపీ కడప నగర యువ నాయకులు గుంటి నాగేంద్రతో పాటు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.