పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేసు
వేముల: మండలంలోని పెర్నపాడు, పెండ్లూరు గ్రామాల్లో బుధవారం మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేసు ఆధ్వర్యంలో “పొలం పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రైతులకు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా 11 అంకెలతో కూడిన విశిష్ట ఐడీ నంబర్‌ను నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే రైతులందరూ తప్పనిసరిగా ఈ-పంట నమోదు చేసుకోవాలని తెలిపారు.
ప్రస్తుత ఎల్‌నినో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పత్తి పంట పొలాలను సందర్శించి, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.





