సత్తుపల్లి/ ఖమ్మం
సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరాలు, చర్చిలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర రావు డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షుడు బానోత్ విజయకుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కె. నరసింహంకు వినతిపత్రం అందజేశారు. అనుమతులు, భవన నిర్మాణ నిబంధనలు పరిశీలించి ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. RTI ద్వారా పట్టణంలోని చర్చిలు, ప్రార్థనా మందిరాల అనుమతుల వివరాలను కోరినట్లు తెలిపారు. అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు చట్టాలు సమానంగా వర్తించాలన్నారు. కార్యక్రమంలో సాలి శివకృష్ణ, భాస్కరణ వీరంరాజు, పాల నాగ సురేందర్ రెడ్డి, జొనబోయిన కార్తీక్, డాక్టర్ పెద్దిరాజు మంద శివ, బట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.



