శ్రీ కాళహస్తి, ఆగస్టు 18, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి పెయింటింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరుపతి రీజినల్ సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థిని ఎన్. ప్రజ్ఞశ్రీ ప్రత్యేక బహుమతి సాధించగా, నాలుగో తరగతి విద్యార్థి ఎన్. ధ్రువ చాణక్య ద్వితీయ బహుమతి కైవసం చేసుకుని పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారికి నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న తల్లి స్వాతిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత, కృషే ఈ విజయానికి మార్గమని, రంగుల ప్రపంచంలో ఇదొక అద్భుత విజయమని కొనియాడారు. ఏజీఎం సురేష్ విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ బాలాజి, జోనల్ కోఆర్డినేటర్లు శ్రీనివాసులు, లావణ్య, డీన్ త్రివేణి, ఇంచార్జ్ కల్పన తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి విద్యార్థుల ప్రతిభ-పెయింటింగ్ పోటీల్లో ఘన విజయం