Wednesday, 19 August 2026
  • Home  
  • సర్వే నంబర్లు 145, 163 భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
- మేడ్చల్ – మల్కాజిగిరి

సర్వే నంబర్లు 145, 163 భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

సర్వే నంబర్లు 145, 163 భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూకట్‌పల్లి: వసంతనగర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్లు 145, 163లోని భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన సందర్భంగా వసంతనగర్ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమస్య పరిష్కారం కోసం మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కృషి చేసిన కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండి రమేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వసంతనగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మాకినేని ఏకనారాయణ (వినోద్), డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిలారు శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, సర్వే నంబర్లు 145, 163లోని భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి రమేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వసంతనగర్ డివిజన్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మాకినేని ఏకనారాయణ (వినోద్) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా వసంతనగర్ డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా వారి వెంట ఉంటూ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సర్వే నంబర్లు 145, 163 భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

కూకట్‌పల్లి: వసంతనగర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్లు 145, 163లోని భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన సందర్భంగా వసంతనగర్ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాలాభిషేకం నిర్వహించారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమస్య పరిష్కారం కోసం మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కృషి చేసిన కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండి రమేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వసంతనగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మాకినేని ఏకనారాయణ (వినోద్), డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిలారు శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, సర్వే నంబర్లు 145, 163లోని భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి రమేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వసంతనగర్ డివిజన్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మాకినేని ఏకనారాయణ (వినోద్) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా వసంతనగర్ డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా వారి వెంట ఉంటూ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమం అనంతరం ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.