వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, పార్టీ నమ్మినబంటు అప్పారి లక్ష్మీనారాయణ అకాల మరణం అమలాపురం నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల నియోజకవర్గ ఇంచార్జ్ పినిపే శ్రీకాంత్
అప్పారివారిపాలెంలో లక్ష్మీనారాయణ భౌతికకాయాన్ని సందర్శించి అశ్రునివాళులర్పించిన డాక్టర్ శ్రీకాంత్, పాడె మోసి అంతిమయాత్రలో నడిచారు. కష్టకాలంలో పార్టీకి వెన్నెముకగా నిలిచిన నాయకుడికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఈ అంతిమయాత్రలో రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి బాబు, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి గొవ్వల రాజేష్, రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి సుబ్బురాం, నాయకులు అంజి, శ్రీరామ్, సత్యనారాయణ మాస్టర్, రమణ తదితరులు పాల్గొన్నారు.


