Sunday, 16 August 2026
  • Home  
  • కొత్తవలసలో ఎఫ్ బి సి క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
- విజయనగరం 

కొత్తవలసలో ఎఫ్ బి సి క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 16.( పున్నమి ప్రతినిధి ) FBC క్లబ్ నూతన కమిటీని ఆదివారం జరిగిన సభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, అలాగే క్లబ్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సభ్యులు తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా జి. మహేంద్ర, ఉపాధ్యక్షుడిగా ఎ . సోమేష్, కార్యదర్శిగా టీ .రవి, సహాయ కార్యదర్శిగా ఎస్ . తాతారావు, కోశాధికారిగా డి . శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా సూరిబాబు మరియు అన్నాజీ బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా పి . రఘునాథ్, వై.నాగరాజు, ఆర్. ప్రసాదరావు, కె . అప్పలరాజు (మిల్క్ బుజ్జి), కె . అప్పలబుచ్చి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని, సభ్యుల సహకారంతో మరిన్ని సేవా, క్రీడా మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ప్రతిష్ఠను మరింత పెంపొందిస్తామని తెలిపారు. సమావేశంలో సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 16.( పున్నమి ప్రతినిధి )

FBC క్లబ్ నూతన కమిటీని ఆదివారం జరిగిన సభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, అలాగే క్లబ్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సభ్యులు తెలిపారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా జి. మహేంద్ర, ఉపాధ్యక్షుడిగా ఎ . సోమేష్, కార్యదర్శిగా టీ .రవి, సహాయ కార్యదర్శిగా ఎస్ . తాతారావు, కోశాధికారిగా డి . శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు.

గౌరవ అధ్యక్షులుగా సూరిబాబు మరియు అన్నాజీ బాధ్యతలు స్వీకరించారు.

కమిటీ సభ్యులుగా పి . రఘునాథ్, వై.నాగరాజు, ఆర్. ప్రసాదరావు, కె . అప్పలరాజు (మిల్క్ బుజ్జి), కె . అప్పలబుచ్చి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని, సభ్యుల సహకారంతో మరిన్ని సేవా, క్రీడా మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ప్రతిష్ఠను మరింత పెంపొందిస్తామని తెలిపారు. సమావేశంలో సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.