వైయస్సార్ కడప జిల్లా. పులివెందుల పట్టణం, శ్రీ వీరనారాయణ స్వామి అంధుల ఆశ్రమంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర పిసిసి డెలిగేట్, వేలూరు శ్రీనివాస్ రెడ్డి, మరియు వైయస్సార్ కడప జిల్లా మాజీ కార్యదర్శి బాలం సుబ్బరాయుడు, వంగవీటి రాధా-రంగ మిత్రమండలి రాయలసీమ జోనల్ సెక్రటరీ, నక్కా సునీల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమం నిర్వాహకుడు, రామ్మోహన్ ప్రత్యేకంగాఆహ్వానించారన్నారు.అనంతరం ఆశ్రమంలో వృద్ధుల సమక్షంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎందరో మహానుభావులు మహనీయులు త్యాగాలకు పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించిందని మహాత్మా గాంధీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో వీరుల త్యాగాలను మనం స్మరించుకోవాలని స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడం మాత్రమే కాదు ప్రతి భారతీయుడు గౌరవంగా ధైర్యంగా బాధ్యతగా జీవించగలడం అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అనాధలకు పంపిణీ అనంతరం అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.
Uploaded Video:


