విజయనగరం జిల్లా బ్యూరో రమణ ఆగస్టు 12 పున్నమి ప్రతినిధి
జిల్లాస్థాయిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.
ర్యాలీ ఉదయం 7.30 గంటలకు కోట కూడలి వద్ద ప్రారంభమై, మూడు లాంతర్ల మీదుగా గంటస్తంభం వరకు కొనసాగుతుందని తెలిపారు. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా 150 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా నిర్వహించనున్న ఈ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటాలని ఆయన కోరారు.


