రామచంద్రాపురం ఆగస్టు 12 పున్నమి ప్రతినిధి
అమరావతి చిత్ర కళావీధి ప్రదర్శనలో మండలానికి చెందిన కుప్పం బాదూరు మాజీ సర్పంచ్ యం వెంకటస్వామి ప్రతిభ చాటుకున్నారు. ఇటీవల జరిగిన అమరావతి చిత్ర కళావీధి ప్రదర్శనలో 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు కలిగిన భారీ క్యాన్వాస్ క్లాత్‌పై శ్రీ వేంకటేశ్వర స్వామి పెయింటింగ్ ఆర్ట్‌ను ప్రదర్శించారు.ఈ కళాఖండం పర్యవేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు, ప్రముఖులు వెంకటస్వామిని ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రం అందజేశారు. మాజీ ప్రజా ప్రతినిధి, వైఎస్ఆర్సిపి నాయకుడు సాధించిన ఈ విజయంపై మండలంలో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


