ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి న్యూస్)
రైలు మార్గంలో ఖమ్మానికి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ బృందాలు మోతీనగర్ సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పదంగా కనిపించిన సంచులను పరిశీలించగా 15.7 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని ఖమ్మం-2 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గంజాయి తరలింపులో ఉన్న నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐలు నాగరాజు, వెంకటేష్ తెలిపారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.



