Monday, 28 September 2026
  • Home  
  • స్థానిక ఎన్నికల్లో వందశాతం విజయమే కూటమి లక్ష్యం
- తూర్పు గోదావరి

స్థానిక ఎన్నికల్లో వందశాతం విజయమే కూటమి లక్ష్యం

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి వందశాతం విజయాలు సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపిక, పార్టీల మధ్య సమన్వయం చేపట్టాలని సూచించారు. చిన్నపాటి విభేదాలు అసంతృప్తికి దారితీయకుండా నాయకులు తక్షణమే స్పందించాలని కోరారు. కూటమి నేతలు 24 గంటలూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని, ఐక్యతతో పనిచేసి వందశాతం విజయాల దిశగా ముందుకు సాగాలని నల్లమిల్లి అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.