శ్రీ కాళహస్తి, ఆగస్టు 08, (పున్నమి న్యూస్): ‘టీడీపీ అంటేనే డీఎస్సీ’ అని, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిందని రాష్ట్ర టిడిపి కార్యదర్శి మాసారపు సుబ్బయ్య స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ, ఆయనతో చర్చించేందుకు గొడ్డలి పార్టీ నేతలకు దమ్ముందా అని నిలదీశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షం డీఎస్సీపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలతో ఆడుకుంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఇప్పటికైనా ఆపాలని, ధైర్యముంటే నేరుగా చర్చకు రావాలని సుబ్బయ్య వైకాపాకు సవాల్ విసిరారు.

మెగా డీఎస్సీపై చర్చకు వైకాపాకు దమ్ముందా-టిడిపి రాష్ట్ర కార్యదర్శి సవాల్