ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 8 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మండలంలోని బైపాస్ వద్ద శనివారం వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న వోల్వో బస్సు ముందు వెళ్తున్న లారీ నెమ్మదించడంతో అదుపు తప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో విశాఖపట్నం వైపు తరలించారు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మనుబోలు బైపాస్ వద్ద వోల్వో బస్సుకు ప్రమాదం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 8 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మండలంలోని బైపాస్ వద్ద శనివారం వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న వోల్వో బస్సు ముందు వెళ్తున్న లారీ నెమ్మదించడంతో అదుపు తప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో విశాఖపట్నం వైపు తరలించారు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

