విశాఖపట్నం
మోదీని సాగనంపుదాం ! దేశాన్నిరక్షించుకుందా !
దేశంలో మార్పు కావాలి ! అన్న నినాదం తో సిపిఐ ఆగస్టు 06 వ తేది నుండి 15 వ తేదీ వరకు దేశ వ్యాపితంగా నిర్వహిస్తున్న పాదయాత్రలు గురువారం విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం తగరపువలసలో నాలుగురోడ్లు జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రారంభించారు.
ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ విమల, రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా కార్యదర్శి ఎస్ కె రహిమాన్ తదితరులు మాట్లాడుతూ కేంద్రంలోని బి.జె.పి. ప్రజా వ్యతిరేక పాలనను నిరసించండని ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వాణిజ్య సముదాయాలకు ప్రజలకు ఇంటి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచారు.
ఆగస్టు 6 వ తేది నుండి 15 వ తేది వరకు పాదయాత్రలు నిర్వహించి, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చే పడతామని తెలిపారు.
విశాఖలో పెడుతున్న డేటా సెంటర్లు వలన పర్యావరణం దెబ్బతిని త్రాగునీరు, సాగునీరు లేకుండపోతుందని, ఆర్ ఆర్ బి సెంటర్ విశాఖపట్నం లోనే పెట్టాలని, ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని,
సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని,
ప్రతీ యువకుడికి ఉద్యోగం కల్పించాలని,
మహిళా రిజర్వేషన్ బిల్లు యదాతదంగా తక్షణమే అమలుచేయాలని,
కార్మికుల హక్కులను పరిరక్షించాలని,
దళితిలు, ఆదివాసీలపై నిత్యం జరుగుతున్న అకృత్యాలను, దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బి.జె.పి. అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం, సుపరిపాలన మరియు మెరుగైన భవిష్యత్తును అందిస్తామని వాగ్దానం చేసిందని, దానికి భిన్నంగా దేశంలో నేడు పెరుగుతున్న నిరుద్యోగం, భరించలేని ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఆర్ధిక అసమానతలు అసమానతలు, బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కుచించుకుపోతున్న ప్రజాస్వామ్యం, పెరుగుతున్న సామాజిక ఉద్రిక్తతలను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య పౌరుల రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, బి.జె.పి. మరియు ఆర్.ఎస్. ఎస్. పదేపదే మతపరమైన ధ్రువీకరణ, మానసిక విజ్ఞప్తులు, సృష్టించబడిన వివాదాలవైపు మొగ్గుచూపుతున్నాయన్నారు. జవాబుదారీతనం నుండి తప్పించుకోడానికి మతాన్ని వాడుకుంటున్నారని,వైఫల్యాలను దాచడానికి ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి విభజనను ప్రోత్సహిస్తున్నారన్నారు. యువత పోటీ పరీక్షల కోసం ఏళ్ళ తరబడి సన్నద్ధమవుతుంటే, నియామకాలు ఆలస్యం కావడం, రద్దు కావడం లేదా వరుస పేపర్ లీకేజీల వల్ల పక్కదారి పట్టడం వంటివి జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ కాకుండా అలాగే ఉండిపోతుంటే, శాశ్వత/సురక్షితమైన ఉద్యోగాల స్థానంలో ఒప్పంద (కాంట్రాక్ట్) ఉద్యోగాలు వచ్చి చేరుతున్నాయని, చదువుకున్న యువత చేతిలో డిగ్రీలు ఉన్నప్పటికీ, వారి ఆకాంక్షలకు తగ్గ అవకాశాలు లభించకపోవడంతో ఒక పరీక్ష నుండి మరో పరీక్షకు తిరుగుతూనే ఉన్నారన్నారు. చదువు తమ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేస్తుందనే ఆశతో కుటుంబాలు తమ పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నాయి. కానీ దానికి బదులుగా, లెక్కలేనంతమంది భారతీయ యువత తీవ్ర నిరాశకు గురవుతూ, నిరుద్యోగులుగా మారుతూ, తమ రేపటి భవిష్యత్తు గురించి అనిశ్చితితో మిగిలిపోతున్నారని, బి.జె.పి. ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాలలో నిరుద్యోగం ఒకటి అనే నిజాన్ని ఎంతటి ప్రచారం కూడా దాచలేని పరిస్థితి దేశంలో నెలకొందని,
పెరిగిపోతున్న నిరుద్యోగంతో పాటు, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) కూడా ప్రజలపై మోయలేని భారంగా మారిందని, మార్కెట్ కు వెళ్ళిన ప్రతిసారీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ ఆదాయాలు పెరగడం లేదనే చేదు నిజం ప్రజలకు గుర్తుకొస్తూనే ఉందని, ఆహార పదార్థాలు, వంటగ్యాస్, రవాణా, విద్యుత్, వైద్యం మరియు విద్యా ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని, జీతగాళ్ళ సంపాదన వారి కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదన్నారు. మరోవైపు దినసరి కూలీలు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికే తీవ్రంగా శ్రమిస్తున్నారని, వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించడంతో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబాలు వైద్య చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారని, అవసరమైన ఖర్చులను తగ్గించుకుంటున్నారని కేవలం బ్రతకడం కోసమే పేదలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అయినప్పటికీ, మోదీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో సాధించిన పైపై విజయాలను వేడుకగా జరుపుకుంటుంటే, సాధారణ పౌరులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక అభద్రతా భావాన్ని అనుభవిస్తున్నారని, తగరపువలస లో ఆర్ టి సి క్యాంప్లెక్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఈ పాదయాత్రలో సిపిఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్, కార్యవర్గం సభ్యులు ఎం డి బేగం, కె వనజాక్షి, ఎం మన్మధరావు, ఆర్ శ్రీనివాసరావు, ఎన్ నాగభూషణరావు భీమిలీ, మధురవాడ ఏరియా పార్టీ కార్యదర్సులు కె రాంబాబు, వి సత్యనారాయణ, మోర అప్పలరాజు, కె ఈశ్వరరావు, మాజీ కౌన్సిలర్ మావూరి సన్యాసమ్మ తదితరులతో పాటు సిపిఐ జిల్లా సమితి సభ్యులు, పార్టీ శాఖ కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.


