బద్రాద్రి కొత్తగూడెం.ఆగస్ట్.1.(పున్నమి వార్తలు)
ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి నీటిమట్టం 46.50 అడుగులకు చేరింది. దీంతో నదిలో 10,73,546 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. 48 అడుగులకు చేరుకుంటే అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.



