పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం జూలై 26
రామచంద్రాపురం మండలం కమ్మపల్లి ఏఏడబ్ల్యు గ్రామంలో వారం రోజులుగా జరుగుతున్న మాతమ్మ తిరుణాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం చివరి రోజు కావడంతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అమ్మవారికి సారె తీసుకువచ్చి సమర్పించారు. మాతమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా వుండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు Y.చంద్రశేఖర్ రెడ్డి , రాష్ట్ర పార్టీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు ఓబుల్ రెడ్డి, పంచాయతీ పార్టీ అధ్యక్షులు మహేంద్ర రెడ్డి, మండల నాయకులు భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ రాజేష్, మండల బీసీ సెల్ అధ్యక్షులు కుప్పం భాస్కర్ యాదవ్ , మండల పార్టీ సెక్రటరీ సుధాకర్ , మురళి , ప్రతాప్, ముక్కోటి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.



