శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో ప్రతిభకు గుర్తింపు
తాళ్లపూడి, జూన్ 9 (పున్నమి ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీ కార్యదర్శులకు జిల్లాల వారీగా అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా అధికారులు ఎంపిక చేశారు.
ఎంపికైన గ్రామ పంచాయతీలలో తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామ పంచాయతీ చోటు దక్కించుకోవడం విశేషం. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు తాడిపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి తానేటి నవీనకు ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డు లభించింది.
మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పి.ఆర్ & ఆర్డి అడిషనల్ కమిషనర్ సుధాకర్ బాబు చేతుల మీదుగా నవీన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా నవీన మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో తాడిపూడిని మరింత పరిశుభ్రమైన, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అవార్డు అందుకున్న నవీనను ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తోటి పంచాయతీ కార్యదర్శులు, గ్రామ నాయకులు మరియు ప్రజలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా తాడిపూడి నవీనకు రాష్ట్ర స్థాయి అవార్డు
శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో ప్రతిభకు గుర్తింపు తాళ్లపూడి, జూన్ 9 (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీ కార్యదర్శులకు జిల్లాల వారీగా అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన గ్రామ పంచాయతీలలో తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామ పంచాయతీ చోటు దక్కించుకోవడం విశేషం. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు తాడిపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి తానేటి నవీనకు ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డు లభించింది. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పి.ఆర్ & ఆర్డి అడిషనల్ కమిషనర్ సుధాకర్ బాబు చేతుల మీదుగా నవీన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నవీన మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో తాడిపూడిని మరింత పరిశుభ్రమైన, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవార్డు అందుకున్న నవీనను ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తోటి పంచాయతీ కార్యదర్శులు, గ్రామ నాయకులు మరియు ప్రజలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

