Tuesday, 21 July 2026
  • Home  
  • చింతకానిలో బీజేపీ మండల సమావేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: బోయినపల్లి చంద్రశేఖర్
- ఖమ్మం

చింతకానిలో బీజేపీ మండల సమావేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: బోయినపల్లి చంద్రశేఖర్

చింతకాని, జూలై (పున్నమి ప్రతినిధి): చింతకాని భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు కొండా గోపి అధ్యక్షతన మంగళవారం మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడు, చింతకాని మండల ఇన్‌చార్జి బోయినపల్లి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ విస్తరణ, రానున్న పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను, అనగాని రామారావు, బొర్రా శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆవులూరి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చింతకాని, జూలై
(పున్నమి ప్రతినిధి):

చింతకాని భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు కొండా గోపి అధ్యక్షతన మంగళవారం మండల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడు, చింతకాని మండల ఇన్‌చార్జి బోయినపల్లి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ విస్తరణ, రానున్న పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను, అనగాని రామారావు, బొర్రా శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆవులూరి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.