Monday, 24 August 2026

🚀శ్రీహరికోట తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్” విక్రమ్ వన్” విజయవంతం🚀🚀🚀 పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ (శ్రీహరికోట )జులై 18, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మరో చారిత్రాత్మక ఘటనకి వేదికగా నిలిచింది. జూలై 18వ తేదీ శనివారం నాడు భారత అంతరిక్ష కేంద్రం తొలిసారిగా ప్రైవేట్ భాగస్వామ్యానికి నాంది పలుకుతూ ప్రయోగించిన” విక్రమ్ వన్ “ప్రయోగం అద్భుత విజయాన్ని సాధించింది. హైదరాబాద్ చెందిన “స్కైరూట్ ఏరో స్పేస్ ” సంస్థ వారు శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి శనివారం ఉదయం 11:30 లకు “మిషన్ ఆగమన్ ” పేరిట నిర్వహించిన విక్రం వన్ రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ తిరిగి 12:05 నిమిషాలకు ప్రయోగింపబడ్డ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా నాలుగు చిన్నపాటి ఉపగ్రహాలను రెండు పేలోడ్లను వాటితో పాటు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చేతిరాతతో వ్రాసిన “వందేమాతరం” సందేశం తో కూడిన పోస్ట్ కార్డును కూడా అంతరిక్షంలోకి పంపడం జరిగింది. ఈ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలతో మరియు స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ నిర్వాహకులతో ఆనందోత్సాహాలు చోటు చేసుకున్నాయి. ఈ రాకెట్ ప్రయోగం వీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

🚀శ్రీహరికోట తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్” విక్రమ్ వన్” విజయవంతం🚀🚀🚀

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ (శ్రీహరికోట )జులై 18,

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మరో చారిత్రాత్మక ఘటనకి వేదికగా నిలిచింది.
జూలై 18వ తేదీ శనివారం నాడు భారత అంతరిక్ష కేంద్రం తొలిసారిగా ప్రైవేట్ భాగస్వామ్యానికి నాంది పలుకుతూ ప్రయోగించిన” విక్రమ్ వన్ “ప్రయోగం అద్భుత విజయాన్ని సాధించింది.
హైదరాబాద్ చెందిన “స్కైరూట్ ఏరో స్పేస్ ” సంస్థ వారు శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి శనివారం ఉదయం 11:30 లకు “మిషన్ ఆగమన్ ”
పేరిట నిర్వహించిన విక్రం వన్ రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ తిరిగి 12:05 నిమిషాలకు ప్రయోగింపబడ్డ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది.
ఈ రాకెట్ ప్రయోగం ద్వారా నాలుగు చిన్నపాటి ఉపగ్రహాలను రెండు పేలోడ్లను వాటితో పాటు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చేతిరాతతో వ్రాసిన “వందేమాతరం” సందేశం తో కూడిన పోస్ట్ కార్డును కూడా అంతరిక్షంలోకి పంపడం జరిగింది.
ఈ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలతో మరియు
స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ నిర్వాహకులతో ఆనందోత్సాహాలు చోటు చేసుకున్నాయి.
ఈ రాకెట్ ప్రయోగం వీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.