అనకాపల్లి జిల్లా, జూలై 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ):
ఏటికొప్పాక హస్తకళాకారుల జీవనోపాధికి కీలకమైన ఏటికొప్పాక కో-ఆపరేటివ్ సొసైటీ పునరుద్ధరణ, రవాణా సౌకర్యాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై అచ్చుతాపురంలోని పార్టీ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్‌తో హస్తకళాకారులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హస్తకళాకారులు సొసైటీని తిరిగి ప్రారంభించి, కళాకారుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్, ఏటికొప్పాక కో-ఆపరేటివ్ సొసైటీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హస్తకళాకారుల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే సానుకూల స్పందనపై హస్తకళాకారులు హర్షం వ్యక్తం చేస్తూ, ఏటికొప్పాక హస్తకళలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడంలో ఈ సమావేశం కీలక మలుపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీపీ సూర్యచంద్ర శేషగిరిరావు (శేషు), జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, అన్నం సరోజిరావు, రావి చలపతి, సొసైటీ సభ్యులు పెదపాటి బాలాజీ, గొర్ష సంతోష్, వానపల్లి సాయి, కొత్తల నాగేశ్వరరావు, సింహాద్రి శంకర్‌తో పాటు పలువురు హస్తకళాకారులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఏటికొప్పాక కో-ఆపరేటివ్ సొసైటీ పునరుద్ధరణకు ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్ హామీ – హస్తకళాకారుల అభివృద్ధికి కీలక చర్యలు..!
అనకాపల్లి జిల్లా, జూలై 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ): ఏటికొప్పాక హస్తకళాకారుల జీవనోపాధికి కీలకమైన ఏటికొప్పాక కో-ఆపరేటివ్ సొసైటీ పునరుద్ధరణ, రవాణా సౌకర్యాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై అచ్చుతాపురంలోని పార్టీ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్‌తో హస్తకళాకారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారులు సొసైటీని తిరిగి ప్రారంభించి, కళాకారుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్, ఏటికొప్పాక కో-ఆపరేటివ్ సొసైటీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హస్తకళాకారుల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సానుకూల స్పందనపై హస్తకళాకారులు హర్షం వ్యక్తం చేస్తూ, ఏటికొప్పాక హస్తకళలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడంలో ఈ సమావేశం కీలక మలుపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ సూర్యచంద్ర శేషగిరిరావు (శేషు), జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, అన్నం సరోజిరావు, రావి చలపతి, సొసైటీ సభ్యులు పెదపాటి బాలాజీ, గొర్ష సంతోష్, వానపల్లి సాయి, కొత్తల నాగేశ్వరరావు, సింహాద్రి శంకర్‌తో పాటు పలువురు హస్తకళాకారులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

