శ్రీ కాళహస్తి, జులై 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి డివిజనల్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో సోమవారం ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తం 2,00,493 మంది ఓటర్లు ఉండగా, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని, ఇప్పటివరకు 99.6 శాతం పరిశీలన పూర్తయిందని తెలిపారు. డ్రాఫ్ట్ రోల్ ప్రకారం మరణించినవారు, వలస వెళ్లినవారు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్న డూప్లికేట్ కేటగిరీల కింద మొత్తం 33,156 మందిని గుర్తించామన్నారు. ఇందులో మరణించిన వారు 9,027 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 14,552 మంది, డబల్ ఎంట్రీలు ఉన్నవారు 3,166 మంది, ముఖచిత్రాలు సరిగ్గా లేనివారు 43 మంది ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి, రేణిగుంట పట్టణ ప్రాంతాలు కావడంతో మైగ్రేషన్ కారణంగా ఈ రెండు ప్రాంతాల నుంచే 21 వేల మందికి పైగా ఓటర్ల మార్పులు జరిగాయన్నారు. 2002 ఓటర్ల లిస్టుతో సరిపోల్చినప్పుడు 1,90,000 మంది ఓటర్ల వివరాలు నిర్ధారణ అయ్యాయని, మిగిలిన 23,500 మంది వివరాలు అక్షర దోషాలు లేదా ముఖచిత్రాలు సరిపోలకపోవడం వల్ల మ్యాపింగ్ కాలేదని వివరించారు. ఈ నెల 14వ తేదీ గడువు ముగిసిన తర్వాత ఈ 23,500 మందికి నోటీసులు జారీ చేస్తామని, వారు ప్రభుత్వం సూచించిన 11 రకాల గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి సమర్పిస్తే క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించి, ఆన్లైన్లో ఫోటో అప్లోడ్ చేసి ఓటు హక్కును నిర్ధారిస్తారని స్పష్టం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఉంటే, ఫామ్ నెంబర్ 8 ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో ఒకే బూత్ కిందికి మారుస్తామని తెలిపారు. మిగిలిన ఓటర్ల వివరాల పరిశీలనను 45 రోజుల్లో పూర్తి చేసి, సెప్టెంబర్ మాసంలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని, ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని ఆర్డీవో కోరారు.

ఓటర్ల జాబితా పరిశీలనకు ప్రజలు సహకరించాలి-శ్రీకాళహస్తి ఆర్డీవో