శ్రీ కాళహస్తి, జులై 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు సోమవారం నిర్వహించిన ఆకస్మిక వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటికి సరైన రికార్డులు, డ్రైవర్లకు లైసెన్సులు లేని కారణంగా రూ.65,000 పన్ను, పెనాల్టీ విధించారు. తనిఖీల్లో చాలా ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు లేవని, వ్యవసాయ అనుమతులతో ఉన్న వాహనాలను వాణిజ్యపరంగా ఇసుక రవాణాకు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ట్రాక్టర్ యజమానులు తమ వాహనాలకు ఆర్సీ, టాక్స్, పర్మిట్, ఫిట్నెస్ రికార్డులతో పాటు డ్రైవర్లకు లైసెన్సులు తప్పనిసరిగా ఉంచుకోవాలని ఆర్టీవో స్పష్టం చేశారు. వాణిజ్యపరంగా బాడుగకు ఇసుక తోలే ట్రాక్టర్లను ఖచ్చితంగా ‘ఎల్లో బోర్డు’ (కమర్షియల్) కింద మార్చుకున్న తర్వాతే ఉపయోగించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రికార్డుల్లేని 5 ఇసుక ట్రాక్టర్ల సీజ్-రూ.65 వేల జరిమానా