శ్రీ కాళహస్తి, జులై 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (S.I.R) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రజలకు S.I.R అవసరాన్ని వివరించారు. గడువు లోగా ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించాలని, సబ్మిట్ అయిందో లేదో తెలుసుకోవాలని సూచించారు. B.L.O సుమారుగా మూడు సార్లు వస్తారని, రాకపోతే సంబంధిత అధికారులకు తెలియజేసి నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ S.I.R ను సద్వినియోగం చేసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా, శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, సీనియర్ నాయకులు నాగూర్, నాగరాజు, మహేష్, అరుణ్ చరణ్ సారథి తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నేతల అవగాహన కార్యక్రమం