Tuesday, 14 July 2026
  • Home  
  • తాగునీటి సమస్యపై జనసేన నాయకుడు దండి నరేంద్ర క్షేత్రస్థాయి పరిశీలన
- తిరుపతి

తాగునీటి సమస్యపై జనసేన నాయకుడు దండి నరేంద్ర క్షేత్రస్థాయి పరిశీలన

శ్రీ కాళహస్తి, జులై 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉడమలపాడు పంచాయతీ పరిధిలోని గోపాలకృష్ణపురం (చెరుకులపాడు) గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై జనసేన పార్టీ నాయకుడు దండి నరేంద్ర తక్షణమే స్పందించారు. గ్రామంలో ప్రధాన బోర్‌వెల్ మోటార్ సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో గత వారం రోజులుగా తాగునీరు, గృహ అవసరాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సుమారు 120 కుటుంబాలకు చెందిన 400 మంది జనాభా కేవలం ఒకే ఒక మాన్యువల్ బోర్‌పై ఆధారపడి గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక జనసేన నాయకుడు సుబ్రహ్మణ్యం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దండి నరేంద్ర వెంటనే గ్రామాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో రెండు బోర్‌వెల్‌లను, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడి సమస్య తీవ్రతను తెలుసుకున్నారు. అనంతరం ఈ సమస్యపై సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడగా, వారు సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న మోటార్‌కు మరమ్మతులు చేయడంతో పాటు, రెండో బోర్‌వెల్‌లో అదనపు పైపులు వేసి, రెండింటినీ వాటర్ ట్యాంక్‌కు అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరత రాకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని దండి నరేంద్ర అధికారులకు సూచించారు. అధికారుల వేగవంతమైన స్పందన, ఈ ప్రతిపాదనల అమలుతో గ్రామానికి నిరంతర నీటి సరఫరా అందుతుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్‌డీఏ ప్రభుత్వం, జనసేన పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.