శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్‌ను దుత్తలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై జి. సుభాషిణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ, ప్రజలకు చేరువగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వహించాలని, ప్రజల సమస్యలకు త్వరితగతిన స్పందించి న్యాయం జరిగేలా చూడాలని ఆకాంక్షించారు. సహచర సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ దుత్తలూరు,మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆయన నూతన ఎస్సైకి దిశానిర్దేశం చేశారు.

దుత్తలూరు నూతన ఎస్సైకి ఎమ్మెల్యే సురేష్ ఫ్రెండ్లీ పోలీసింగ్ సూచనలు