Sunday, 12 July 2026
  • Home  
  • ​ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆరోగ్య హక్కు చట్టం’ తేవాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

​ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆరోగ్య హక్కు చట్టం’ తేవాలి

​వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందుతున్నా పేదలకు వైద్యం అందడం లేదని, కాబట్టి ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించాలని డాక్టర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ‘ప్రజారోగ్య వేదిక’, ‘శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్యులు డాక్టర్ నాగమునెయ్య, డాక్టర్ సబిత, డాక్టర్ శోభారాణిలను ఘనంగా సన్మానించారు. ​ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.వి రమణయ్య మాట్లాడుతూ… ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు కావాలని, ‘ఆరోగ్య హక్కు చట్టాన్ని’ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను PPP పద్ధతిలో కాకుండా, పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. డాక్టర్ రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

​వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందుతున్నా పేదలకు వైద్యం అందడం లేదని, కాబట్టి ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించాలని డాక్టర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ‘ప్రజారోగ్య వేదిక’, ‘శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్యులు డాక్టర్ నాగమునెయ్య, డాక్టర్ సబిత, డాక్టర్ శోభారాణిలను ఘనంగా సన్మానించారు.
​ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.వి రమణయ్య మాట్లాడుతూ… ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు కావాలని, ‘ఆరోగ్య హక్కు చట్టాన్ని’ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను PPP పద్ధతిలో కాకుండా, పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. డాక్టర్ రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.