*నెల్లూరు జిల్లా..గూడూరు రూరల్*
*💥యువకుడి ప్రాణం తీసిన కేబుల్ తవ్వకాలు*💥
*💥కేబుళ్లు వేసేందుకు రోడ్డు పక్కన తవ్వకాలు,మట్టి దిబ్బలు*💥
*👉మృతుడు సైదాపురం మండలం పాలూరు గ్రామానికి చెందిన రుద్రరాజు వెంకటేశ్వర్లు రాజు(35) గా తెలుస్తుంది*
*👉మృతునికి కొంత కాలం క్రితమే వివాహం అయ్యింది,ఇతను నెల్లూరు తిరుపతి వెళ్ళే ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది*
*👉R&B రోడ్డు బరం ను అక్రమంగా తవ్వేస్తున్నా అటు వైపు కన్నెత్తి చూడని R&B అధికారులు*
*👉రోడ్డు కు అత్యంత ముక్యం రోడ్డు బరం, దీన్నే షోల్డర్ అని కూడా అంటారు*
*👉రోడ్డుకు కనీసం మూడు మీటర్లు షోల్డర్ తవ్వకూడదు,అలా తవ్వితే రోడ్డు పటుత్వం పోతుంది,వర్షాలకు రోడ్డు పక్కన తవ్విన చోట భూమి కుంగి రోడ్డు దెబ్బతినడం, వాహనాలు ఇరుక్కు పోవడం,ప్రమాదాలు జరగడం జరుగుతుంది*
*👉కేబుళ్లు కోసం,పైప్ లైన్ల కోసం ఇష్టా రాజ్యంగా రోడ్డు బరం ను తవ్వేసి,ఆ మట్టి రోడ్డు మీద పోసి అరాచకాలు చేస్తున్నా ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ఏ మాత్రం పట్టించుకొని R&B శాఖ,ఇతర ప్రభుత్వ శాఖలు*
*👉రుద్రరాజు వెంకటేశ్వర్లు రాజు మరణానికి పరోక్షంగా కారణం అయిన కేబుల్ తవ్వకం యజమానులు,అక్రమ తవ్వకాలు అడ్డుకొని R&B అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్*
నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గూడూరు రాపూరు మార్గం లో తిప్పవరపాడు దాటాక భూగర్భ కేబుళ్లు కోసం R&B రోడ్డు పక్కనే గాడి తీసి ఆమట్టి రోడ్డు పై పోయడం తో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మట్టి దిబ్బలు ఢీ కొని సైదాపురం మండలం పాలూరు గ్రామానికి చెందిన రుద్రరాజు వెంకటేశ్వర్లు రాజు(35)అనే యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు,ఇటీవలే ఆ యువకునికి వివాహం జరిగినట్టు తెలుస్తుంది,సైదాపురం మండలం వ్యాప్తంగా అనేక చోట్ల భూ గర్భ కేబుల్ కోసం,వాటర్ పైపు లోను కోసం భారీ గోతులు తీస్తున్నారు,ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు,వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నా ప్రాణాలు పోతున్నా అసలు పట్టించుకునే వారు లేరు,కొందరు స్థానికులు అక్కడక్కడ వ్యతిరేకిస్తున్నా అభివృద్ధి పనుల పేరుతో అక్రమార్కులు తప్పించుకుంటున్నారు,అభివృద్ధి చేయాలి కానీ నిబంధనలు ప్రకారం రోడ్డుకు మూడు మీటర్లు అవతల తవ్వాలి,పనులు పూర్తయ్యాక రీ కన్స్ట్రక్షన్ చేయాలి, మున్సిపాలిటీల్లో పనులు జరిగినా,పంచాయతీల్లో పనులు జరిగినా సదరు అధికారులు వద్ద అనుమతి తీసుకోవాలి,,తవ్వకాలు వల్ల జరిగే డ్యామేజ్ పూర్తి స్థాయిలో రీ కన్స్ట్రక్షన్ చేయాలి ఇందుకు గాను
కొంత గ్యారంటీ కింద బ్యాంక్ డిపాజిట్ చేయాలి, రోడ్డు పక్కన తవ్వకాలు జరిగే సమయం లో రోడ్డు పై మట్టి పోయకూడదు,వాహన దారులకు ఇబ్బందుకు కలిగించకూడదు,ముక్యంగా R&B అధికారి పర్యవేక్షణ ఉండాలి ఇలా ఎన్నో నిబంధనలు వున్నా అన్ని నిబంధనలు తుంగలో తొక్కి కొందరి చేతులు తడిపి ఇష్టా రాజ్యంగా రోడ్లు నాశనం చేస్తున్న గుత్తేదారులు కారణంగా ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారు..ఈ రోజు వెంకటేశ్వర్లు మరణానికి పరోక్షంగా,ప్రత్యక్షంగా కారణం అయిన మట్టిదిబ్బలు రోడ్డు పై పోసిన భూగర్భ కేబుల్ గుత్తేదారు పై,రోడ్డు పై మట్టి పోస్తున్న పట్టించుకొని R&B అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని మృతిని కుటుంబ సభ్యులను ఆర్దికంగా ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..
*💥వినోద్ కుమార్ NEWS తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్*💥
Uploaded Video:


