నర్రవాడ వెంగమాంబ జాతర సందర్భంగా గురువారం ఉదయం 10:35 గంటలకు నర్రవాడ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు (AP 39 Z 0016)లో మహిళా ప్రయాణికురాలితో కండక్టర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. నర్రవాడ నుంచి దుత్తలూరు వెళ్లాల్సిన మహిళ టికెట్ ఇవ్వాలని కోరగా, కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యంగా మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో బస్సులోని ఇతర ప్రయాణికులు కండక్టర్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. జాతరకు వచ్చే భక్తులు, సాధారణ ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని కోరుతూ, ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.

వెంగమాంబ జాతర స్పెషల్ బస్సులో ఉద్రిక్తత.. మహిళతో కండక్టర్ దురుసు ప్రవర్తన, చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల డిమాండ్