పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మోకు దెబ్బ రాష్ట్ర కోఆర్డినేటర్, విహార్ ట్రస్ట్ నాయకులు మొగులూరి యాకయ్య గారి తండ్రి మొగులూరి వీర సోములు గారు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న వీర సోములు గారిని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతిరెడ్డి గారు చెన్నూరులోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.*
*ఈ సందర్భంగా వీర సోములు గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.*
*ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న హనుమాండ్ల నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపిటిసి బొమ్మగాని భాస్కర్, పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కామారపు సునీల్, పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భైరి భార్గవ్, తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.*


