Thursday, 9 July 2026
  • Home  
  • కూటమి ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న కాశి రామకృష్ణ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కూటమి ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న కాశి రామకృష్ణ

ప్రస్తుత కూటమి ప్రభుత్వ అనాలోచిత విధానాలు, నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్ఆర్సిపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు స్వర్గధామం చూపిస్తామని నమ్మబలికిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక అన్నదాతలను పూర్తిగా గాలికి వదిలేసారు అన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు అటు సాగునీరు అందక, ఇటు యూరియా దొరకక అష్టకష్టాలు పడుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, కాలువలకు నీటిని విడుదల చేసి నెలలు గడుస్తున్న , క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది అన్నారు. ముఖ్యంగా కాలువల చివరి ప్రాంత టైల్ ఎండ్ భూములకు కనీసం నారుమడులు పోసుకునేందుకు, చల్లుకునేందుకు కూడా నీరు అందడం లేదు అన్నారు. నీటి సరఫరాలో క్రమబద్ధీకరణ లేకపోవడం వల్ల ఎగువ ప్రాంతాల వారికే నీరు సరిపోతుంటే, దిగువన ఉన్న పేద, మధ్యతరగతి రైతులు ఎండబెట్టుకున్న పొలాల వైపు చూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు అన్నారు. ప్రభుత్వ నిఘా లోపం వల్లే నీటి పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. నీటి ఎద్దడి ఒకవైపు రైతులను వేధిస్తుంటే, ఉన్న అరకొర నీటితో సాగు మొదలుపెట్టిన రైతులకు యూరియా కొరత పెద్ద శాపంగా మారిందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో యూరియా నిల్వలు లేవంటూ పేర్కొంటున్నారని, మరోవైపు, ప్రైవేట్ వ్యాపారులు యూరియాను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి తెరతీసారన్నారు. వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, ఈ కృత్రిమ కొరతను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందన్నారు.వెంటనే నీటి పారుదల శాఖాధికారులను అప్రమత్తం చేసి, కాలువల చివరి ఆయకట్టు వరకు సాగునీరు క్రమబద్ధంగా అందేలా చర్యలు తీసుకోవాలని కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలోనూ, గ్రామాల్లోనూ తగినంత యూరియా స్టాక్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి, ఎక్కువ ధరలకు అమ్ముతున్న డీలర్ల లైసెన్సులను రద్దు చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సాగునీరు లేక నష్టపోయిన నారుమడులను పరిశీలించి, సదరు రైతులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలన్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వ అనాలోచిత విధానాలు, నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్ఆర్సిపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు స్వర్గధామం చూపిస్తామని నమ్మబలికిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక అన్నదాతలను పూర్తిగా గాలికి వదిలేసారు అన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు అటు సాగునీరు అందక, ఇటు యూరియా దొరకక అష్టకష్టాలు పడుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, కాలువలకు నీటిని విడుదల చేసి నెలలు గడుస్తున్న , క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది అన్నారు. ముఖ్యంగా కాలువల చివరి ప్రాంత టైల్ ఎండ్ భూములకు కనీసం నారుమడులు పోసుకునేందుకు, చల్లుకునేందుకు కూడా నీరు అందడం లేదు అన్నారు. నీటి సరఫరాలో క్రమబద్ధీకరణ లేకపోవడం వల్ల ఎగువ ప్రాంతాల వారికే నీరు సరిపోతుంటే, దిగువన ఉన్న పేద, మధ్యతరగతి రైతులు ఎండబెట్టుకున్న పొలాల వైపు చూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు అన్నారు. ప్రభుత్వ నిఘా లోపం వల్లే నీటి పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
నీటి ఎద్దడి ఒకవైపు రైతులను వేధిస్తుంటే, ఉన్న అరకొర నీటితో సాగు మొదలుపెట్టిన రైతులకు యూరియా కొరత పెద్ద శాపంగా మారిందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో యూరియా నిల్వలు లేవంటూ పేర్కొంటున్నారని,
మరోవైపు, ప్రైవేట్ వ్యాపారులు యూరియాను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి తెరతీసారన్నారు. వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, ఈ కృత్రిమ కొరతను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందన్నారు.వెంటనే నీటి పారుదల శాఖాధికారులను అప్రమత్తం చేసి, కాలువల చివరి ఆయకట్టు వరకు సాగునీరు క్రమబద్ధంగా అందేలా చర్యలు తీసుకోవాలని కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలోనూ, గ్రామాల్లోనూ తగినంత యూరియా స్టాక్‌ను అందుబాటులో ఉంచాలన్నారు.
ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి, ఎక్కువ ధరలకు అమ్ముతున్న డీలర్ల లైసెన్సులను రద్దు చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సాగునీరు లేక నష్టపోయిన నారుమడులను పరిశీలించి, సదరు రైతులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.