ఖమ్మం, జూలై
(పువ్వాడ నాగేంద్ర కుమార్ – పున్నమి జిల్లా రిపోర్టర్):
ఖమ్మం నగరంలో నేటి నుంచి లోకల్ ఆటో సర్వీసుల మినిమమ్ ఛార్జీని రూ.30గా అమలు చేస్తున్నారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, విడిభాగాల ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. ఇకపై నగర పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు కనీసం రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుపై ప్రయాణికులకు ముందస్తు అవగాహన కల్పించాలని ఆటో యూనియన్లు కోరాయి. కొత్త మినిమమ్ ఛార్జీల అమలు నేటి నుంచే ప్రారంభమైనట్లు డ్రైవర్లు వెల్లడించారు



