రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్, జూలై 8: SIR-2026 కార్యక్రమంలో భాగంగా గ్రామాలతో పాటు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. బీఎల్ఓలతో కలిసి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఓటర్ల వివరాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.
ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు, మార్పులు, చేర్పులు లేదా తొలగింపులు జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు అభ్యంతరాలు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ అవగాహన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు మరియు మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.


