ఏటికొప్పాకలో విగ్రహానికి నివాళులు.. కేక్ కట్ చేసి సేవలను స్మరించిన నాయకులు…
అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి, జూలై 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఏటికొప్పాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చింతలపాటి వెంకట సూర్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్యం రంగాల్లో వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతగా ఆయనను స్మరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.


