అనకాపల్లి జిల్లా, జూలై 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఏటికొప్పాక గ్రామంలోని బూత్ నెం.6 ఓటర్లకు జనసేన పార్టీ యువ నాయకుడు, (BLA) గొంతు మూర్తి కొండయ్య నాయుడు కీలక విజ్ఞప్తి చేశారు. బూత్ నెం.6 పరిధిలో ఇంకా 150 ఎన్యూమరేషన్ ఫారాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఓటర్లు తమకు అందిన ఫారాలను పూర్తిగా నింపి జూలై 12లోగా సంబంధిత (BLO)కు లేదా ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో అందజేయాలని కోరారు. ఇంకా ఫారం అందని వారు వెంటనే గ్రామ సచివాలయాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు లేక ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొంతు మూర్తి కొండయ్య నాయుడు పిలుపునిచ్చారు.


