Thursday, 2 July 2026
  • Home  
  • భర్తను కోల్పోయిన మహిళలకు ఎన్టీఆర్ భరోసా… పెన్షన్ మార్పిడి పూర్తి చేసి అండగా నిలిచిన కూటమి నాయకులు..!
- అనకాపల్లి

భర్తను కోల్పోయిన మహిళలకు ఎన్టీఆర్ భరోసా… పెన్షన్ మార్పిడి పూర్తి చేసి అండగా నిలిచిన కూటమి నాయకులు..!

యలమంచిలి , జూలై 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్న కూటమి నాయకులు మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఏటికొప్పాక గ్రామంలో భర్తలను కోల్పోయిన ఇద్దరు మహిళలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను వారి పేర్లకు మార్పిడి చేయించి అందేలా చర్యలు చేపట్టారు. మరణించిన కర్రి చిన్నోడు భార్య శ్రీమతి కర్రి అప్పలనర్స, మరణించిన కొనగంట్ల సత్యలింగం భార్య శ్రీమతి కొనగంట్ల బమరాంబ పేర్లకు పెన్షన్ మార్పిడి ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వారికి అందేలా కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో కృషి చేశారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కూటమి నాయకుల సేవా దృక్పథాన్ని అభినందిస్తూ, ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి అచ్చయ్య నాయుడు, బీజేపీ శెన్నాంశెట్టి శ్రీను, అన్నం స్వరాజరావు, రావి చలపతి, నాగిరెడ్డి రమణ, ఎర్రంశెట్టి బాబ్జి, మోలేటి ప్రసాద్, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

యలమంచిలి , జూలై 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్న కూటమి నాయకులు మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఏటికొప్పాక గ్రామంలో భర్తలను కోల్పోయిన ఇద్దరు మహిళలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను వారి పేర్లకు మార్పిడి చేయించి అందేలా చర్యలు చేపట్టారు.
మరణించిన కర్రి చిన్నోడు భార్య శ్రీమతి కర్రి అప్పలనర్స, మరణించిన కొనగంట్ల సత్యలింగం భార్య శ్రీమతి కొనగంట్ల బమరాంబ పేర్లకు పెన్షన్ మార్పిడి ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వారికి అందేలా కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో కృషి చేశారు.
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కూటమి నాయకుల సేవా దృక్పథాన్ని అభినందిస్తూ, ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి అచ్చయ్య నాయుడు, బీజేపీ శెన్నాంశెట్టి శ్రీను, అన్నం స్వరాజరావు, రావి చలపతి, నాగిరెడ్డి రమణ, ఎర్రంశెట్టి బాబ్జి, మోలేటి ప్రసాద్, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.