Sunday, 28 June 2026
  • Home  
  • “నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియోతో చిన్నారుల ఆరోగ్యానికి భరోసా”
- అనకాపల్లి

“నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియోతో చిన్నారుల ఆరోగ్యానికి భరోసా”

ఏటికొప్పాక జూన్ 28 | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్: ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 28న ఏటికొప్పాక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి మండలం బీజేపీ సీనియర్ నాయకులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు శన్నంశెట్టి శ్రీను, ఎలమంచిలి రూరల్ ప్రచార కార్యకర్త నూకరాజు, బీజేపీ కార్యకర్తలు దావీద్ రాజు, షేక్ సాయిబాబా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమానికి మద్దతు తెలిపారు. అలాగే మెడికల్ ఆఫీసర్ రోహిణి, సీహెచ్‌ఓ కృష్ణవేణి, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు కూడా విశేషంగా స్పందించి తమ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడంతో కార్యక్రమం విజయవంతమైంది. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు వేయించడం ద్వారా పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.

ఏటికొప్పాక జూన్ 28 | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్:

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 28న ఏటికొప్పాక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి మండలం బీజేపీ సీనియర్ నాయకులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు శన్నంశెట్టి శ్రీను, ఎలమంచిలి రూరల్ ప్రచార కార్యకర్త నూకరాజు, బీజేపీ కార్యకర్తలు దావీద్ రాజు, షేక్ సాయిబాబా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
అలాగే మెడికల్ ఆఫీసర్ రోహిణి, సీహెచ్‌ఓ కృష్ణవేణి, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు కూడా విశేషంగా స్పందించి తమ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడంతో కార్యక్రమం విజయవంతమైంది. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు వేయించడం ద్వారా పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.