Friday, 26 June 2026
  • Home  
  • వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం-గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఉదారత
- తిరుపతి

వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం-గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఉదారత

శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ డాక్టర్ ఎం.వరలక్ష్మి, ప్రెసిడెంట్ సాయి దీపిక నేతృత్వంలో, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం జరిగింది. ఇందులో సుమారు 35 మంది వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. హాస్పిటల్ సిబ్బంది నరేష్ కృష్ణ, అంబికా, శ్రీనివాసులు, శ్రీదేవి వైద్య సేవలు అందించారు. పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వృద్ధులను తిరుపతిలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్‌కు స్వయంగా తీసుకెళ్లి, వారికి అవసరమైన ఉచిత శస్త్రచికిత్సలు, చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.వరలక్ష్మి మాట్లాడుతూ… వృద్ధాశ్రమాల్లోని నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అండ లేని వృద్ధులకు అండగా నిలవడమే ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. సాయి దీపిక కూడా ఈ సేవా పనుల్లో చురుకుగా పాల్గొని వృద్ధులకు భరోసా కల్పించారు. తల్లి, కూతుళ్లుగా వరలక్ష్మి, సాయి దీపిక చేస్తున్న సామాజిక సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తుండగా, వృద్ధుల కళ్లలో వెలుగులు నింపిన ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.