శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ డాక్టర్ ఎం.వరలక్ష్మి, ప్రెసిడెంట్ సాయి దీపిక నేతృత్వంలో, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం జరిగింది. ఇందులో సుమారు 35 మంది వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. హాస్పిటల్ సిబ్బంది నరేష్ కృష్ణ, అంబికా, శ్రీనివాసులు, శ్రీదేవి వైద్య సేవలు అందించారు. పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వృద్ధులను తిరుపతిలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్కు స్వయంగా తీసుకెళ్లి, వారికి అవసరమైన ఉచిత శస్త్రచికిత్సలు, చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.వరలక్ష్మి మాట్లాడుతూ… వృద్ధాశ్రమాల్లోని నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అండ లేని వృద్ధులకు అండగా నిలవడమే ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. సాయి దీపిక కూడా ఈ సేవా పనుల్లో చురుకుగా పాల్గొని వృద్ధులకు భరోసా కల్పించారు. తల్లి, కూతుళ్లుగా వరలక్ష్మి, సాయి దీపిక చేస్తున్న సామాజిక సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తుండగా, వృద్ధుల కళ్లలో వెలుగులు నింపిన ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం-గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఉదారత