సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో SIR కార్యశాల సోమవారం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని పీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు హాజరుకానున్నారు. బీజేపీ నేత నంబూరు రామలింగేశ్వరరావు కూడా పాల్గొననున్నారు. SIR ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించడంతో పాటు ఓటర్ల జాబితా పరిశీలన, సవరణలు, నమోదు తదితర అంశాలపై కార్యశాలలో చర్చించనున్నారు. నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్తుపల్లి నియోజకవర్గ కమిటీ కోరింది.



