Friday, 26 June 2026
  • Home  
  • ‘స్వచ్ఛ స్వర్ణముఖి’ ప్రజా ఉద్యమానికి శ్రీకారం-ఆలయ అధికారులకు కోలా విశాలి వినతి
- తిరుపతి

‘స్వచ్ఛ స్వర్ణముఖి’ ప్రజా ఉద్యమానికి శ్రీకారం-ఆలయ అధికారులకు కోలా విశాలి వినతి

శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి ప్రాంతపు ఆధ్యాత్మిక, పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నమైన స్వర్ణముఖి నది సంరక్షణే ధ్యేయంగా ‘స్వచ్ఛ స్వర్ణముఖి’ పేరిట ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ‘తేజోభారత్’ సంస్థాపక అధ్యక్షురాలు, ముక్కంటి దేవస్థానం బోర్డు మెంబర్ కోలా విశాలి ప్రకటించారు. కాలుష్యం, ఆక్రమణల బారిన పడుతున్న నదిని పునరుజ్జీవింపజేసేందుకు, ఈ ఉద్యమానికి మద్దతు, మార్గదర్శకత్వం అందించాలని కోరుతూ ఆలయ ఈవో బీకే వెంకటేశులు, ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్‌లకు గురువారం ఆమె వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచభూత స్థలమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంతో పాటు, ప్రపంచ ప్రసిద్ధ కలంకారీ కళ కూడా ఈ నదీ తీరాన్నే వృద్ధి చెందాయని గుర్తుచేశారు. నేడు వ్యర్థాల విసర్జన వల్ల నది ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు నమామి గంగే, సబర్మతి రివర్‌ఫ్రంట్ స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. దీని కింద నదిలో కాలుష్య ప్రాంతాల గుర్తింపు, పారిశుధ్య డ్రైవ్‌లు, వ్యర్థాల సేకరణ కేంద్రాల ఏర్పాటు, నదీ పరివాహక ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పాఠశాలలు, ఆలయాల్లో పబ్లిక్ అవేర్నెస్ సదస్సులు నిర్వహించడంతో పాటు యువత, భక్తులతో ఒక పెద్ద వాలంటీర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. “ప్రకృతి సేవయే – సమాజ సేవ” అనే నినాదంతో స్వర్ణముఖి నదిని రాబోయే తరాలకు క్లీన్ అండ్ గ్రీన్‌గా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. ఆలయ అధికారుల సహకారంతో దీనిని ఏపీలోనే ఒక మోడల్ పర్యావరణ ఉద్యమంగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకత్వం తరఫున ఈవో బీకే వెంకటేశులుకు కోలా విశాలి “ఏక్ పెడ్ మా కే నామ్” మొక్కను అందించి, దానిని ఆలయ పరిసరాల్లో నాటాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.