శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్‌పేట మున్సిపల్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం అక్షర చైతన్యంతో ముందుకు సాగారు. ‘సంకల్పం – విద్యా ప్రగతి’ కార్యక్రమం భాగంగా పాఠశాల పరిధిలోని పలు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు “ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలి”, “విద్యే మన భవిష్యత్తు” వంటి నినాదాలతో ప్రజల్లో విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు SMC చైర్మన్ జి. శ్రీనివాసులు, కో-ఆప్టెడ్ సభ్యుడు బాలు ఢిల్లీ బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

విద్యే భవిష్యత్తు… బడిబాట పట్టాలని సందేశం– విద్యార్థుల చైతన్య యాత్ర