ఏర్పేడు, 21 (పున్నమి న్యూస్( ఏర్పేడు మండల పరిధిలోని కొత్తవీరాపురం, కోబాక గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాల్లో మంగళవారం ‘8వ పోషణ్ పక్వాడా’ (పోషణ పక్షోత్సవాలు) కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. రేణిగుంట ప్రాజెక్ట్ CDPO కృష్ణవేణి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రగతి MCO శిరీష మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో చిన్నారులు జంక్ ఫుడ్‌కు, మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారని, ఇది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి, శారీరక ఆటలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యవంతులైన బిడ్డలకు జన్మనివ్వగలరని, బయటి ఆహార పదార్థాలు (జంక్ ఫుడ్) పూర్తిగా నివారించాలని కోరారు. చిన్నారులకు కూడా ఇంట్లో వండిన తాజా ఆహారాన్నే పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తవీరాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM), అంగన్‌వాడీ కార్యకర్తలు వైష్ణవి, శారద, నాగభూషణమ్మ, హెల్పర్స్ భారతి, ప్రగతి సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యంపై అంగన్‌వాడీల ప్రత్యేక అవగాహన