శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా ప్రాజెక్ట్ కాలనీలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్న కక్షతో తల్లీకూతుళ్లపై ఒక వర్గం దాడికి తెగబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెలుగు గంగా ప్రాజెక్ట్‌లో జరుగుతున్న అక్రమాలపై బాధితురాలు జి. గీత గతంలో కలెక్టర్‌కు, స్థానిక పోలీసులకు, పత్రికలకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి గంగయ్య, సుబ్బారెడ్డి ఆమెపై కక్ష పెంచుకున్నారు. కాలనీ ఇంచార్జి రామ్మోహన్ అండతో తమను ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై నిలదీయగా, గంగయ్య, అతని భార్య, కుటుంబ సభ్యులు, ఆలయ ఉద్యోగి గంగమ్మ కలిసి గీత, ఆమె కుమార్తె షామిలిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో షామిలి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోవడంతో, ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దాడి జరుగుతున్న సమయంలో బాధితులు స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి పోలీసులను ఘటనా స్థలానికి పంపారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధితులు తమ ఫిర్యాదులో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఫిర్యాదు చేసినందుకే వేధింపులు.. గీత, షామిలిపై గంగయ్య కుటుంబం దాడి