Wednesday, 22 April 2026
  • Home  
  • డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జన్మదినం-జనసేన శ్రేణుల బర్త్ డే విషెస్
- తిరుపతి

డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జన్మదినం-జనసేన శ్రేణుల బర్త్ డే విషెస్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్( ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, PAC సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం తిరుపతిలో అత్యంత వేడుకగా జరిగాయి. తిరుపతి జిల్లా జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసైనికులు, నాయకుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు పేట బ్రదర్స్, మిత్రబృందం జనసేన కార్యాలయంలో డాక్టర్ హరిప్రసాద్ ని కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పేట బ్రదర్స్ మాట్లాడుతూ.. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అటు వైద్యరంగంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ నిబద్ధతతో పనిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఆయన చూపే చొరవ, జనసేన పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న కృషి వెలకట్టలేనిదని భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, పేట బ్రదర్స్ మిత్రబృందం సభ్యులు, ఇతర పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.